చిరంజీవి సినిమాలకు దూరమైనప్పటి నుంచీ ఆయన 150వ చిత్రం ఎప్పుడు...? అనే ఆసక్తికరమైన ప్రశ్న ఉదయిస్తూనే ఉంది.
నాకూ చేయాలని ఉంది అని కొన్నాళ్లు, లేదు.. ఇప్పుడు రాజకీయాలే ప్రధానం అని మరికొన్నాళ్లూ చిరు తన అభిమానులతో దోబూచులాడారు. అయితే తనయుడు రామ్‌చరణ్ మాత్రం డాడీ కోసం కథలు వింటూనే ఉన్నాడు. డాడీతో ఓ సినిమా తీసి, అరుదైన క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని తహతహలాడుతున్నాడు. 150వ సినిమా కోసం కొంతమంది దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఇక చిరు సినిమాలు చేయడేమో అనే నిర్ణయానికొచ్చేశారు ఆయన అభిమానులు.
వారందరికీ ఇదో శుభవార్త! చిరు 150వ సినిమా మళ్లీ చర్చలకు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి కసరత్తులు జరుగుతున్నాయని తాజా సమాచారమ్. 2014 అసెంబ్లీ ఎన్నికల తరవాతే ఈ సినిమా ఉంటుందట. ఇప్పటికి కథ కూడా సిద్ధమైందని తెలుస్తోంది. ఒకవేళ అధినేత్రి ఆదేశిస్తే, ఎన్నికలకు ముందే ఈసినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారమ్.
No comments:
Post a Comment