అవును 2 ఉందా?


థ్రిల్ల‌ర్ సినిమాలు తీయ‌డంలో ర‌విబాబు స్టైలే వేరు. హ‌లీవుడ్ చిత్రాల స్ఫూర్తితో తెలుగులో మ్యాజిక్ చేస్తుంటారాయ‌న‌. అన‌సూయ‌, అవును అలాంటి క‌థ‌లే. ఆ క‌థ ముగింపు కూడా విచిత్రంగా ఉంటుంది. రెండో భాగం కోసం ప‌నికొస్తుందిలే అనుకొని, ఆ క‌థ‌ల‌ను అర్థాంత‌రంగా ముగించేస్తుంటారు. అవును విష‌యంలోనూ అదే చేశారు. ఈ క‌థ స‌డ‌న్ గా శుభం కార్డు వేసుకొంటుంది. ఈ క‌థ‌ని కొన‌సాగించ‌డానికి ర‌విబాబు రెండో బాగం తీయ‌బోతున్నారు. అవును... అవును సినిమాకి సీక్వెల్ రాబోతోంది. అవును సినిమా ఎక్క‌డైతే ఆగిందో, అక్క‌డి నుంచే ఈ క‌థ మొద‌ల‌వుతుంద‌ట‌. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రాణె, పూర్ణిమ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ర‌విబాబు ఆత్మ పాత్ర‌లో న‌టించారు. అవును 2లో కూడా ఈ మూడు పాత్ర‌లు క‌నిపిస్తాయ‌ట‌. ప్ర‌స్తుతం స్ర్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. ర‌విబాబు ప్ర‌స్తుతం న‌రేష్‌తో ల‌డ్డూ బాబు సినిమాని రూపొందిస్తున్నారు. ఆ సినిమా పూర్త‌యిన త‌ర‌వాతే అవును 2 ఉండే అవ‌కాశాలున్నాయి.

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment