ఇండియాలో అతి చిన్నప్రాంతం గోవా. గోవా
బీచ్‌లో ఎక్కడ చుసిన దారుణాలు... నిండా 12 ఏళ్లయినా నిండని చిన్నారులు
అంగడి బొమ్మలుగా మారుతున్నారట! 50 రూపాయలకే సెక్స్ సుఖాన్ని అందించే
ఆటబొమ్మలుగా మారిపోతున్నారని ‘బాగా బీచ్’ సినీ దర్శకనిర్మాతలు ప్రమోద్
సల్గార్‌కర్, లక్ష్మీకాంత్ షెట్‌గావ్‌కర్ అంటున్నారు. గోవా టూరిజం
ఇండస్ట్రీ గురించి అందరూ గొప్పగా చెబుతుంటారని, కానీ ఈ టూరిజం వెనుక దాగిన
చీకటి కోణాలు ఎవరికీ తెలియవని వారన్నారు. గోవా టూరిజం ప్లేస్
చెప్పుకోవటానికే గాని... అక్కడ జరిగేవన్నీ అశ్లీల కార్యకలాపాలే.
ఇక్కడి ఈ ఇండస్ట్రీలో దాగిన దారుణాలను
ఇతివృత్తంగా తీసుకుని ‘బాగా బీచ్’ మూవీని తీస్తున్నట్టు వారు చెప్పారు. ఓ
సెక్స్ బ్రోకర్ ఓ హంగేరియన్ టూరిస్ట్‌కి 50 రూపాయలకే చైల్డ్ సెక్స్ సుఖం
లభిస్తుందని చెప్పాడని, ఈరోజుల్లో ఈ డబ్బుకి చికెన్ కూడా లభించదని వారు
చెప్పారు. సినిమా యూనిట్ వారు ఆ బ్రోకర్ ను కదిపితే ఇక్కడ ఇలాంటివి
సర్వసాదారణం అని చెప్పాడట. ఇక్కడ ఉన్నవారు ఏ పని చెయ్యరు... చెయ్యటానికి
కూడా ఇక్కడేమి ఇండస్ట్రీస్ లేవు... ఏ పని లేనప్పుడు ఏం చెయ్యలా అని ఎదురు
ప్రశ్న వేసాడట.
గోవాలో ప్రతిరోజూ సగటున నలుగురు
బాలికలపై లైంగిక వేధింపులో, అత్యాచారాలో జరుగుతుంటాయని, ఇవి ప్రభుత్వం
చెబుతున్న లెక్కలని షెట్‌గావ్‌కర్ అన్నారు. ఇండియాలో అనేకమంది బాలికలు
పేదరికంవల్లో, తలిదండ్రుల బలవంతంవల్లో చిన్న వయస్సులోనే వేశ్యలుగా మారడం
ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇక్కడ అమ్మాయిలకు అందం ఉంటే చాలట. అందమైనా
అమ్మాయిలకు ఫుల్ డిమాండ్ అని బ్రోకర్ చెప్పటం సినిమా యూనిట్ మొహం తేలేసారు.
ఇలాంటి వాటిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని చట్టాలను సవరించి న్యాయం
చెయ్యాలని ఆ సినిమా యూనిట్ అంటోంది.
No comments:
Post a Comment