ఇటీవల ముంబయ్ లో కథానాయిక శృతి హాసన్ పై ఆమె నివాసంలోనే దాడి జరిగిన విషయం మనకు తెలిసిందే. కూతురుపై జరిగిన ఈ దాడి ఆమె తల్లి సారికను ఎంతగానో కలవరపెట్టింది. ఈ విషయమై సారిక ఇప్పుడు స్పందించింది. "ఇలాంటి ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అసలు ఎప్పుడేం జరుగుతుందో ఎవరం చెప్పలేం. అందుకే, ఎప్పుడూ శృతి గురించే ఆలోచిస్తూ వుంటాను. ఇలాంటి సంఘటనలను ధైర్యంగా ఎదుర్కోవాలి" అంటోంది సారిక.
అన్నట్టు, శృతి ముంబయ్ లోనే ఉంటున్నప్పటికీ తల్లి వద్ద కాకుండా ఒంటరిగా ఫ్లాట్ తీసుకుని ఉంటోంది. ఇదే ప్రస్తావిస్తే, "ఎదుగుతున్న కొద్దీ పిల్లలు స్వేచ్చ కోరుకుంటారు. వారిని మనం ఇబ్బంది పెట్టకూడదు. అందుకని వారిని ఒంటరిగానే ఉండనివ్వాలి. మనం చేసేదేమిటంటే, మంచి సలహాలివ్వడమే" అని చెప్పింది సారిక.
No comments:
Post a Comment