ఒక్క హిట్టు ఆకాశానికి ఎత్తేస్తుంది. ఒక్క ఫ్లాప్ అక్కడి నుంచి అమాంతం కిందకు నెట్టేస్తుంది. హరీష్ శంకర్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. గబ్బర్ సింగ్ తరవాత హరీష్ రాత్రికి రాత్రే స్టార్ దర్శకుడు అయిపోయాడు. పిలిచి మరీ అడ్వాన్సులు ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి తల్లకిందులైంది. రామయ్యా వయ్యావయ్యా ఫ్లాప్ తరవాత హరీష్ కి ఒక్కొక్కరూ దూరమవుతున్నారు. అడ్వాన్సులు కూడా వదులుకోవడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా హరీష్ శంకర్ కి కటీఫ్ చెప్పేసినట్టు సమాచారమ్. అల్లుఅర్జున్ - హరీష్ శంకర్‌ల కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతుందని ప్రచారం జరిగింది. డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించాల్సింది. అయితే ఈ ప్రాజెక్టు ఇప్పుడు లేదట. అల్లు అర్జున్ రేసు గుర్రం ముగిసిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకొన్నాడు. ఆ తరవాత గోపీచంద్ మలినేని సినిమాఉంటుంది. అందుకే హరీష్ కూడా ఇప్పుడు మరో హీరో అన్వేషణలో పడిపోయినట్టు సమాచారమ్. డి.వి.వి. దానయ్య కూడా ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యారట. చూశారా..?? ఓ ఫ్లాప్ ఎంత పని చేస్తుందో..?
ఫ్లాప్ వస్తే అంతేమరి..!

ADs
#CellPhone #Radiation on #Human #Body - #southreelnews
— South Reel News (@southreelnews1) 20 March 2017
https://t.co/FmjZ6iLbKQ

No comments:
Post a Comment