బుజ్జిగాడు రెడీ అయిపోయాడోచ్‌


ప్రేమ‌క‌థాచిత్రమ్ తో తొలి విజ‌యాన్ని అందుకొన్నాడు సుధీర్‌బాబు. ఆ సినిమా హార‌ర్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో సాగింది. ఈసారి మాస్ ని టార్గెట్ చేశాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాతో.  గంగదాసు కృష్ణ రెడ్డి దర్శకుడు.  ఎస్.ఎన్ రెడ్డి, సుబ్బారెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అస్మితా సూద్, పూనమ్ కౌర్ హీరోయిన్స్. శ్రీ సంగీతం అందించారు. శుక్ర‌వారం ఈ చిత్రానికి సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఈ చిత్రానికి  U/A స‌ర్టిఫికెట్ ల‌బించింది. డిసెంబ‌రు 5న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. ``సుధీర్ బాబులోని మాస్ కోణాన్ని పూర్తిగా ఎలివేట్ చేస్తున్నాం. ఆయ‌న సిక్స్ ప్యాక్ బాడీతో క‌నిపిస్తారు. కుటుంబబంధాల‌కూ చోటుంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్నీ ఆక‌ట్టుకొనే చిత్రం అవుతుంది`` అని ద‌ర్శ‌కుడు చెబుతున్నారు.

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment