ఆడవాళ్ళు అనే పదం అంటేనే అతగాడికి అంత
చులకన.. అయినా.. అతన్నే పెళ్లాడతానంది ఆమె ! ఆమె ఎవరా అనేగా మీ
ప్రశ్న...ఆమె ఎవరో కాదు సుచిత్రా కృష్ణమూర్తి. సంచలన దర్శక నిర్మాత
రాంగోపాల్ వర్మ మీద అలనాటి నటి, సింగర్ అయిన సుచిత్రా కృష్ణమూర్తి మనసు
పారేసుకుంది. వర్మని పెళ్లాడతానని ప్రపోజ్ చేసింది. వీళ్లిద్దరూ కలిసి
కొన్ని సినిమాలకు పని చేశారు కూడా! వర్మ ఎలాగైతేనేం.. తన మనసులోని మాటను
బయటపెట్టాడు. ఆడవాళ్లని తాను సెక్స్ సింబల్స్‌గానే చూస్తానని, భారతీయ వివాహ
వ్యవస్థమీద తనకు నమ్మకం లేదని సెక్స్ కోసమే తాను మహిళల్ని వాడుకుంటానని
కుండబద్దలు కొట్టాడు.
ఓ సందర్భంలో సుచిత్రా అతనికి "రామూ !
నన్ను పెళ్లి చేసుకుంటావా" అని మెసేజ్ పంపిన సంగతి నిజమేనట. అదే
విషయాన్నీఈమె ‘డ్రామాక్వీన్’ అనే తన ఫిక్షనల్ ఆటోబయాగ్రఫీలో పేర్కొంది.
దీనికి చాలా రోజుల తర్వాత వర్మ నుంచి ఆమెకు రిప్లయ్ వచ్చింది. ఆ రిప్లై
కోసం సుచిత్రా వర్మ ఆఫీసుకి వచ్చింది. ఆమె తన ఎదురుగా కూర్చోగానే వర్మ
తనదైన శైలిలో భారతం మొదలెట్టాడు. "సుచిత్రా ! నువ్వు నన్ను తప్పుగా అర్ధం
చేసుకున్నావ్. మనం ఒకరికొకరం సరిపడం. నా మైండ్ సెట్ తో ఎవ్వరిని ఇబ్బంది
పెట్టలేను. నేను ఈ రోజు ఎలా అలోచిస్తానో... రేపు ఎలా అలోచిస్తానో నాకే
తెలియదు. అసలు పెళ్లంటే నాకు నమ్మకం లేదు.. ఆల్రెడీ నాకు పెళ్లైంది. ఆ
జీవితాన్ని అనుభవించలేకే నా మొదటి భార్యను వదిలేసాను. సెక్స్ కోసమే
మహిళల్ని వాడుకుంటాను. నువ్వు అలాంటి దానివి కావని నాకు తెలుసు. నా
అభిప్రాయం ప్రకారం.. ఆడవారి శరీరాన్నే చూడాలి, వాళ్లు చెప్పేవి వినకూడదు"
అని వర్మ తడుముకోకుండా మొత్తం చెప్పాడట.
ఇది నిజంగా మీ రియల్ లైఫ్‌లో జరిగిన
సంఘటనేనా అని మీడియా ప్రశ్నిస్తే... నిజమేనని సుచిత్ర చెప్పింది.
"రాంగోపాల్ వర్మకి నేను మెసేజ్ పంపిన సంగతి వాస్తవమే! అతన్ని
పెళ్లాడాలనుకున్నా. ఆ మెసేజ్‌కి అతడిచ్చిన రిప్లయ్‌ని కూడా చూశా" అని
తెలిపింది. మీ ప్రైవేట్ సంభాషణని బయటకు లీక్ చేసినందుకు వర్మకి కోపం రాలేదా
అని ప్రశ్నించగా... అఫ్‌కోర్స్... అతడి అనుమతి తీసుకున్నానని, పర్మిషన్
లేకుండా దీనినెలా బయటపెడతానని ఎదురుప్రశ్న వేసింది. సో సంచలనాల వర్మకి తన
జీవితమే ఓ సెన్సేషన్ అన్న మాట.
No comments:
Post a Comment