టాలీవుడ్ లో నిర్మాతలు, హీరోలలో 14రీల్స్
ఎంటర్టైనర్ పతాకం బ్యానర్.. ప్రిన్స్ మహేష్ కు మధ్య బిజినెస్ డీల్ బాగా
సెట్ అయిపొయింది. ఇప్పటికే రెండు సినిమాలని చేసిన మహేష్ వీళ్ళతో మూడో
సినిమాకు కూడా సైన్ చేసేశాడు. అయితే ఇప్పుడు మహేష్ ని నమ్మి ఈ నిర్మాతలు
రిస్క్ చేస్తున్నారా? అనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ 1 నేనొక్కడినే సినిమాను
ఈ నిర్మాతలు సొంతం రిలీజ్ చేసుకుంటున్నారు.
1 సినిమా నిర్మాతలు అనిల్ సుంకర, రామ్
ఆచంట, గోపిచంద్ ఆచంటలు.. ఉత్తరాంధ్ర, గుంటూరు మినహా ఎక్కడా డిస్ట్రిబ్యూషన్
హక్కులను అమ్మటం లేదని.. సొంతంగా సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేయాలని
చూస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టికొని
బాక్స్ ఆఫీస్ లో సినిమా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకంతోనే సొంతంగా రిలీజ్
చేసుకోవాలని చూస్తున్నారట.
అయితే నిర్మాతలు తీసుకున్నఈ నిర్ణయం
చాలా సాహసంతో కూడుకున్నదని.. భారీ వ్యయంతో నిర్మించిన సినిమాను అమ్మేసుకొని
డబ్బులు వచ్చేలా చూసుకుంటే మంచిదని సినీ వర్గాలు అంటున్నాయి. నిర్మాతలే
డిస్ట్రిబ్యూషన్ చేస్తే సినిమా తేడా కొడితే మొత్తానికి మోసం వస్తుందని
విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ నిర్మాతలు ఏమి చేస్తారో చూడాలి!
No comments:
Post a Comment