హమ్మయ్య…ఇప్పటికిప్పుడు తెలంగాణ ఆగిపోయింది. ఇది ఎంత వరకు ముందుకు పోతుందో చెప్పలేం, మొత్తం మీద సమైక్యవాదులకు మాత్రం కాస్తా తీపి వార్తను హోం మంత్రి షిండే వినిపించారు. అయితే క్లియర్ గా కాకుండా కాస్తా కన్ఫ్యూజన్ మాత్రం కనిపించినా కూడా రేపటి క్యాబినెట్ లో మాత్రం తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం లేదన్న విషయం మాత్రం స్పష్టం చేసారు షిండే. దీంతో సమైక్య వాదులు కాస్తా ఊపిరి పీల్చుకోవచ్చు.
తెలంగాణ బిల్లును ఈ రోజే తయారు చేస్తారు, ఇదే ఆఖరు జీఓఎం సమావేశం అందరు భావించారు. అనుకున్నట్టుగానే ఉదయం నుంచి ఢిల్లీలో జరిగిన పరిణామాలు అలాగే కన్పించాయి. అదికారులు, మంత్రుల బృందం సభ్యులు ఏకంగా మూడున్నర గంటలపాటు సమావేశం అయ్యేసరికి ఇక తెలంగాణ బిల్ పూర్తయినట్టే, రేపటి క్యాబినెట్ లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయడానికే ఇంతగా కష్టపడుతున్నారు అనుకున్నారు. అయితే పలు అంశాలపై ఇంకా న్యాయపరమైన సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున మరోసారో, రెండు సార్లో జిఓఎం సమావేశం అవుతుందన్న విషయం కరెక్టుగా కాకున్నా సూచనాప్రాయంగా షిండే నోట వ్యక్తం అయింది. జిఓఎం సమావేశం అనంతరం షిండే మీడియాతో మాట్లాడుతూ ఇంకా తుదిరూపు రాలేదని, కొంత న్యాయపరమైన సలహాలు తీసుకోవాల్సి ఉందని అన్నారు.
రేపటి క్యాబినెట్ సమావేశంలో మాత్రం తెలంగాణ బిల్ ప్రవేశ పెట్టడం లేదన్నారు. అయితే ఈ నెల 30 లోపు తెలంగాణ బిల్లు పూర్తయి, ప్రత్యేక క్యాబినెట్ మీట్ పెట్టి ఆమోదం పొందవచ్చు అన్న పరోక్ష సంకేతాలిచ్చారు. బిల్లు పూర్తయిందంటూనే కొంత న్యాయపరమైన సలహాలు, పరిశీలన జరగాల్సి ఉందనడమే ఈ అనుమానాలకు కారణం అంటున్నారు విశ్లేషకులు.

No comments:
Post a Comment