దగ్గుబాటి వారి చిన్నోడు రాణా గురించి..
తన ఎఫ్ఫైర్ల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో వెండితెర మీదకు
రాకముందే శ్రేయతో వ్యవహారం నడుపుతున్నాడని ప్రచారం జరగగా.. ఆ మధ్య త్రిషతో
చాలా క్లోజ్ గా ఉన్నాడు. త్రిష, రాణాల వ్యవహారం ఒకదశలో చాలా డీప్ గా
వెళ్లిందని చెప్పుకున్నారు. ఇక బాలీవుడ్ లో అడుగుపెట్టగానే సెక్సీ బ్యూటీ
బిపాసు పటాయించాడని చెప్పారు.
ఇక ఇప్పుడు రాణా ఖాతాలో మరో కొత్త పేరు
కూడా చేరింది. ఆమె ఎవరో కాదు.. కన్నడ నటి రాగిణి ద్వివేది. తాజాగా రాణా
రాగిణి ద్వివేదితో డేటింగ్ చేస్తున్నట్లు కన్నడ చిత్ర సీమలో పుకార్లు
షికార్లు చేస్తున్నాయి. తాజాగా వీరి వ్యవహారంపై ఓ ప్రముఖ పత్రిక.. రాగిణి
రాణా జీవితంలో స్పెషల్ పర్సన్ అని, వాళ్ల మధ్య స్నేహాన్ని మించిన బంధం
ఉందని వార్త కూడా ప్రచురించింది.
అయితే అదంతా ఫేక్ అని రాణా ఘాటుగానే
స్పందించాడు. దీనిపై స్పందించిన రాణా ఇలా ప్రచురించడం పూర్తిగా పూర్తిగా
దిగజారుడు తనమేనని.. ఓ అవార్డు రిహార్సల్ సెషన్స్ కు సంబంధించిన ఫోటోలు
ప్రచురించి అవాస్తవ వార్తలు రాసారని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా
రాగిణి గతంలో యోగేష్ తో ప్రేమ వ్యవహారం నడపగా ప్రస్తుతం రాణాతో డేటింగ్
ఉన్నట్లు కన్నడ సీమలో ప్రచారం ఉంది. మరి ఇందులో నిజమెంతో రాణా, రాగిణిలకే
తెలియాలి!

No comments:
Post a Comment