అతితక్కువ టైం లోనే గోల్డెన్ హ్యాండ్ దిస్ట్రిబ్యూటర్ గా , నిర్మాతగా క్రేజ్ తెచ్చుకున్న దిల్ రాజు, ఎవడు, రామయ్యా వస్తావయ్యా సినిమాల్ని ఒకేసారి సెట్స్ పై ఉంచి ఇంత లక్కీ ప్రొడ్యూసర్ లేడని ఇండస్ట్రీ కి షాక్ ఇచ్చాడు. పాపం ఆ సినిమాలే రాజుకు శాపాలు అవుతాయని ఎవరూ ఊహించి ఉండరు. పక్కా ప్లానింగ్ తో ఉండే రాజు కూడా ఏ సినిమా ముందు రిలీజ్ చేయాలో తెలియని అయోమయ పరిస్తితులు వచ్చి రాజును ఒక్కసారిగా ఇన్నాళ్ళూ ఇండస్ట్రీని, మీడియాని ఆడుకున్నందుకు కసి తీర్చుకున్నాయని కొందరు తోటి దిస్ట్రిబ్యూటర్స్ , నిర్మాతలు మహా సంతోషంగా ఉన్నట్టు టాక్.
ఎందుకు వారికంత ఆనందం అనే ఉదాహరణలు పక్కనపెడితే "నడమంత్రపు పాపులారిటీ" నెత్తికెక్కిన రాజు ( నిజానికి అసలు పేరు వెంకట రమణా రెడ్డి ) చేసిన పాపాలే అతనికి శాపాలు అయ్యాయని ఎందరో ఔత్సాహిక దర్శకులు, నటీనటులు కధలుగా చెప్తారు. కనీసం మీడియాతో సరిగ్గా మాట్లాడ్డం రాని రాజు ను ఇన్నాళ్ళు కంటెంట్ , లక్ కాపాడితే ఇపుడవి దూరమై పదేళ్ళ తర్వాత "ఖాళీగా" కూర్చొనే పరిస్తితులు వచ్చేశాయి. నిర్మాతల్లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే రామానాయుడి లాంటి లెజెండ్ పైన, నా డార్లింగ్ , రామరామ కృష్ణ కృష్ణ సినిమాల ముందు "సింహా" అడవుల్లోకి వెళ్ళాల్సిందే అని బాలకృష్ణ సింహా మూవీ ఫై సెటైర్స్ పేల్చిన రాజు కు ఇపుడు "ఇన్వెస్టర్స్" కరువై అలమటిస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. ఇప్పటికైనా రాజు అందరితో సరిగ్గా ప్రవర్తిస్తూ, ఒదిగి ఉంటె మళ్ళీ తన పూర్వ వైభవం తెచ్చుకోవడానికి సరైన రెండు చిన్న సినిమాలు చాలని, తన సినిమా రిలీజ్ కు వస్తుంటే మరే సినిమా రెండుమూడు వారాలపాటు కనపడకూదడనే "మూర్ఖత్వం" వదిలేస్తే మళ్ళీ రాజు మంచి దిస్త్రిబ్యూటర్ గా, నిర్మాతగా పునరుత్తేజం కావాలని టాలీవుడ్ కోరుకుంటోందని టాక్.
No comments:
Post a Comment