నేను తెలుగు సినిమాలు చెయ్యకపోవడానికి ఆ హీరో నే కారణం


నేను తెలుగు సినిమాలు చెయ్యకపోవడానికి ఆ హీరో నే కారణం

నేను తెలుగు సినిమాలు చెయ్యకపోవడానికి ఆ హీరో నే కారణం
కాజల్  ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ , కాని ఇప్పుడు టాలీవుడ్ లో సినిమా చేయమని అడిగితే దాదాపు 2 కోట్లు డిమాండ్ చేస్తుంది . కొంచెం తగ్గించండి అని నిర్మాతలు అడిగిన నో ఛాన్స్ అని నిఖాసు గా చెప్పేస్తుంది ,ఈ  మధ్య కాజల్ ప్రవర్తనలో వింత మార్పులు చోటుచేసుకున్నాయి.పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్-2’ నటించే అవకాసం వచ్చినా ఆ గోల్డెన్ ఆఫర్ ను కాలతన్నుకుంది. ఆ తరువాత తన దృష్టి అంతా తమిళ సినిమాల పైనే అంటు కోలీవుడ్ ను చిరునామాగా చేసుకున్న కాజల్ ధనుష్, ఉదయనిధి స్టాలిన్, కమలహాసన్ సినిమాలలో ప్రస్తుతం నటించడానికి ఎగ్రిమేంట్ల పై సంతకాలు పెట్టింది కాజల్.

 మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం కాజల్ నటిస్తున్న తమిళ సినిమా నిర్మాతలు ఎవరు కాజల్ కోరుకునే భారీ పారితోషికాలను ఇవ్వడంలేదు. అంతేకాదు మన బడా తెలుగు నిర్మాతలు ఆఫర్ చేస్తున్న పారితోషికంలో కనీసం సగం కూడ కాజల్ కు కోలీవుడ్ నిర్మాతలు ఇవ్వడం లేదట. అయినా అందరికీ ఆశ్చర్య కలిగిస్తూ తమిళ సినిమాల వైపే చూస్తోంది కాజల్. ఇటువంటి పరిస్థుతులలో కాజల్ కు సంబంధించి బయటకు వచ్చిన మరో లేటెస్ట్ న్యూస్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ వెంకటేష్ లు నటించబోతున్న భారీ సినిమాకు కృష్ణవంశీ చరణ్ పక్కన నటించడానికి కాజల్ ను సంప్రదిస్తే ఆమె ఈసినిమా కధను కూడ అసలు వినకుండా తనకు ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని చెప్పిందట. ఈ సినిమా నిర్మాత బండ్ల గణేష్ కాజల్ కు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినా కాజల్ లెక్క చేయలేదట. దీనికి కొనసాగింపుగా కాజల్ ను ఒప్పించడానికి రామ్ చరణ్ వ్యక్తిగతంగా చేసిన ప్రయత్నాలు కుడా విఫలం కావడం టాలీవుడ్ లో చర్చనీయాంసంగా మారి కాజల్ పై మరో సరికొత్త సంచన వార్త బయటకు వచ్చింది.

ఐతే తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ లో ఎవ్వరో ఒక యంగ్ టాప్ హీరో తనని బాగా హార్ట్ చేసాడు అన్నట . దీనితో కాజల్ తెలుగు లో ఇంకా సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యిపోయింది అని టాక్ . దీనికి తోడు కాజల్ తల్లితండ్రులు కూడ కాజల్ ను టాలీవుడ్ సినిమాలలో నటించవద్దని ఒత్తిడి చేస్తున్నారని టాక్.ఇంతకి టాలీవుడ్ టాప్ యంగ్ హీరో లలో ఏ  హీరో  కాజల్ ని భాద పెట్టాడో మరి. 

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment