ఇప్పడు మానవ సంబంధాలు వింతగా
మారుతున్నాయి. ఒకటే మాట..ఒకటే జోడీ..ఇది పాత పాట. ఇప్పుడు రోజులు మారాయి.
ఇష్టాఇష్టాలు మారుతున్నాయి. ఎవరు ఎలాంటి దోస్తీ చేస్తారో..తెలియదు..
పెళ్లయ్యాక కూడా కొత్త ప్రేమలు చిగురిస్తున్నాయి. కొత్త కోరికలు
గుర్రాలవుతున్నాయి. అనగనగా..ఓ పొలిటికల్ టచ్ ఉన్న లేడీ..! అనగనగా...ఓ సినీ
లోకపు యంగ్ మెన్...! ఆ ఇద్దరూ ఇష్టపడ్డారు.. సరదాలు...షికార్లు..ఆకాశమే
హద్దుగా స్నేహం. ఇదీ నేటి తరం. ఆ లేడీకి ఇప్పటికే పెళ్లయి పిల్లలున్నారు.
కానీ..కొత్త ప్రేమ చిగురించింది. కోడె వయస్సు కుర్ర నటుడిపై మనసు పడింది.
అంతే రెండేళ్లకు పైగా ఆ ఇద్దరి ప్రేమ కథ
వింతగా సాగుతోంది. నిన్నువదలి నేను పోలేనులే..అంటూ ఇద్దరూ యుగళగీతాలు
పాడుకుంటుంటే అందరికీ ఆశ్చర్యమేస్తోంది. కుటుంబ సభ్యులకుమాత్రం గుండె
రగిలిపోతోంది. పొలిటికల్ టచ్ ఉన్న ఆ లేడీ..యంగ్ నటుడు ఇద్దరూ ఒకరిని విడిచి
మరొకరు ఉండలేని పరిస్థితి. ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ హోటల్ లో ఆ
ఇద్దరు సేద తీరుతున్నారు. అసలు సంగతి కుటుంబ సభ్యులకు తెలిసింది. అంతే ఇక
సీన్ సితారైంది. లేడీ సోదరుడు ఆ హోటల్ కి వచ్చి రెచ్చిపోయినట్టు
తెలుస్తోంది. చేయి చేసుకునేదాకా పరిస్థితి వచ్చినట్టు తెలుస్తోంది.
ఆ కుర్రనటుడ్ని ఏమీ అనలేని వ్యవహారం. మన
బంగారం మంచిదైతే..ఊరి వాళ్లను అనాల్సిన పనేముంది. పొలిటికల్ టచ్ ఉన్న
అమ్మడు దోస్తానా కుదిరిన కుర్రనటుడు.... బెండకాయలా ముదిరిపోతున్నా పెళ్లి
మాట ఎత్తకపోవడంతో కుటుంబ సభ్యులకు చిరాకొస్తోంది. కానీ ఏంచేయగలరు. అబ్బాయి
మాటకు ఎదురు చెప్పలేరు. పెళ్లి చేసుకుని పచ్చని కాపురం సాగించాల్సింది పోయి
ఇలా సెకండ్ హ్యాండ్ భామతో చెట్టపట్టాల్ వేసుకోవడం వారిని బాధపెడుతోంది. ఏం
చేస్తారు..పాపం..అంతా కలికాలం. ఈ జంట బాగోతం ఎక్కడిదాకాపోతుందో..ఏమో
గమనిక : మానవ సంబదాలు రోజు
రోజుకి దిగజారిపోతున్న ఈ రోజుల్లో నిజంగా జరిగిన ఓ ఘటనను తెలియ చెయ్యాలి
అనే ఉద్దేశంతో మేము పబ్లిష్ చెయ్యటం జరిగింది. మానవ సంబంధం కలిగిన ఈ ఇద్దరు
సొసైటీ లో మంచి పలుకుబడి ఉన్న ఫ్యామిలీకి చెందినా వారు కావటం, వారి పేర్లు
ప్రచురించట లేదు.
No comments:
Post a Comment