గోపీచంద్ ఒప్పుకోలేద‌ట‌..


అహ‌నాపెళ్లంట‌, పూల‌రంగ‌డు సినిమాల‌తో ఆక‌ట్టుకొన్నాడు వీర‌భ‌ద్ర‌మ్. రెండు విజ‌యాల త‌ర‌వాత వ‌చ్చిన భాయ్‌.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగానూ పాస్ మార్కులు సాధించుకోలేక‌పోయాడు వీర‌భ‌ద్ర‌మ్‌. భాయ్ విడుద‌ల‌కు ముందే.. గోపీచంద్‌తో సినిమా చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌లెట్టాడు. భ‌వ్య ఆర్ట్స్ ద‌గ్గ‌ర అడ్వాన్స్ కూడా తీసుకొన్నాడు. అయితే భాయ్ రిజ‌ల్ట్ త‌ర‌వాత ఈ సినిమా డౌటులో ప‌డిపోయింది. వీర‌భ‌ద్ర‌మ్‌తో సినిమా చేయ‌డానికి ఇప్పుడు గోపీచంద్ రెడీగా లేడ‌ట‌. దాంతో ఈ ప్రాజెక్టు స్ర్కిప్టు ద‌శ‌లోనే అట‌కెక్కేసింది. వీర‌భ‌ద్ర‌మ్ చెప్పిన క‌థ గోపీచంద్‌కి అంత‌గా న‌చ్చ‌లేద‌ని స‌మాచార‌మ్‌. దానికి తోడు భాయ్ రిజ‌ల్ట్ కూడా గోపీచంద్‌ని వెన‌క‌డుగు వేయించేలా చేసింది. దాంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. గోపీచంద్ స్థానంలో మ‌రో హీరో కోసం అన్వేష‌ణ మొద‌లెట్టాడు వీర‌భద్ర‌మ్‌. మ‌రి వీరూకి ప‌డిపోయే ఆ హీరో ఎవ‌రో కొన్ని రోజుల్లో తెలుస్తుంది.

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment