చెన్నై చిన్నది సమంతా ఆ మధ్య చర్మవ్యాధితో
బాధపడి కోలుకున్నట్టు మీడియా కోడై కూసింది. అంతేకాదు ఆ రుగ్మతకు చికిత్స
కోసం కేరళ వెళ్లి వచ్చిందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ మధ్య సమంతా
ఫుల్ జోష్ తో సినిమాలతో పాటు కొన్ని సోషల్ కార్యక్రమాలలో పాల్గొంటూ
వచ్చింది. కానీ సమంత మళ్లీ ఇప్పుడు అస్వస్థురాలయి బెడ్ రెస్ట్ లో ఉందట.
ఈ విషయాన్ని స్వయంగా సమంతా ట్వీట్
చేసింది. ప్రస్తుతం ఆరోగ్యం సరిగా లేక బాధ పడుతున్నాను. వరుస పెట్టి మందులు
మింగడం నా వల్ల కావడం లేదు. కొన్ని రోజులుగా తాను షూటింగ్‌లకు
వెళ్లడంలేదని.. వెంటనే కోలుకుని తిరిగి వర్క్‌లో బిజీ అయిపోవాలని ఉంది.
కానీ శరీరం సహకరించడం లేదంటూ అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలిపింది.
అంతేకాదు సరిగ్గా
నిద్రపోలేకపోతున్నానని, డిప్రెషన్‌కు గురవుతున్నానని కూడా చెప్పుకొచ్చింది.
పాపం సమంత అలా తల్లడిల్లి పోతున్న విషయం తెసుకుని అభిమానులు తట్టుకోలేక
పోతున్నారు. వాళ్ళ కళల రాణి సమంతా త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యవంతురాలై తమకు
కనువిందు చేయాలని వాళ్లు కోరుతున్నారు. ఏమైనా సమంతా త్వరాగా కోలుకొని
మళ్లీ షూటింగ్స్ తో బిజీ కావాలని మనమూ కోరుకుందాం!

No comments:
Post a Comment