పాపం చౌదరి రేయ్ సినిమాకు అసలు ఏమాత్రం
క్రేజ్ అనేది రావడం లేదట. నిజానికి చౌదరి మొన్నటివరకు నందమూరి హీరోలు
లేదంటే కొత్త వాళ్ళతో సినిమా చేసేవాడు. అయితే ఈసారి కొత్త వాడినా మెగా
కాంపౌండ్ ట్యాగ్ ఉన్న హీరోను పట్టుకొచ్చాడు. అయినా ఫలితం మాత్రం శూన్యం
అంటున్నారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కించిన రేయ్ సినిమా
పూర్తి నెలలు దాటిపోతుంది.
ఇప్పటికే ఎన్నో వాయిదాలు కూడా పడింది.
దీనికి కారణం మాత్రం ఒక్కటేనని చెబుతున్నారు. తాను ఎంచుకున్న తనకు కరెక్ట్
అనిపిస్తే చాలు దానికి లేనిపోనీ మసాలా దట్టించి బడ్జెట్ పెంచేసి అనవరపు
ఖర్చు చేసేస్తాడని.. ఈ సినిమాకు కూడా అలానే చేసి బడ్జెట్ ను 30 కోట్లు
పెట్టేసాడని.. ఇప్పుడున్న క్రేజ్ ప్రకారం ఈ సినిమాకు అంత పెట్టి కొనే
బయర్లు దొరకడం లేదని చెబుతున్నారు.
కనీసం ఫస్ట్ లుక్ విడుదల చేస్తే
అప్పుడైనా కొంటారు అనుకొంటే అదీ లేదు. ఈ సినిమాకి అసలు మార్కెట్టే
లేకపోవడం విచిత్రం కలిగిస్తోంది. కొనడానికి వచ్చినా మరీ తక్కవకు
అడుగుతున్నారట. 30 కోట్ల సినిమాని 15 కోట్లకు అమ్ముకోలేక తానే సొంతంగా
విడుదల చేసుకోవాలనే ఆలోచనల్లో ఉన్నాడు చౌదరి. త్వరలోనే ఆడియో వేడుకను
మెగా హీరోల సమక్షంలో జరిపి కాస్త క్రేజ్ తీసుకురావాలని ట్రై చేస్తున్నాడు
మరి ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి!
No comments:
Post a Comment