గత కొన్ని రోజులుగా తెలుగులో సరైన అవకాశాలు లేక బాలీవుడ్ కి వెళ్లిన గోవా బ్యూటీ ఇలియానాకు అక్కడ నటించిన తొలిసినిమా సూపర్ హిట్ కావడంతో వరుసగా అవకాశాలు తలుపుతడుతున్నాయి. ప్రస్తుతం ‘హ్యాపీ ఎండింగ్ ’, ‘మై తేరా హీరో ’ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడుకు మరో బంపర్ ఆఫర్ తగిలినట్లు సమాచారం.
సల్మాన్ హీరోగా సూరజ్ భర్జాత్యా రూపొందించే సినిమాలో ఇలియానాను తీసుకున్నారట. మొదట్లో కరీనాకపూర్ కోసం ప్రయత్నించారు. అయితే, డేట్స్ సమస్య వల్ల కుదరకపోవడంతో, ఆ అవకాశాన్ని ఇల్లీ తన్నుకుపోయిందని అంటున్నారు. లక్కుంటే వద్దన్నా అవకాశాలు ఇలా వచ్చి పడుతూనే ఉంటాయి అనడానికి ఇదే ఉదహారణేమో. సల్లుతో ఛాన్స్ దక్కితే ఇల్లు దశ ఇంకా తిరగడం ఖాయం అంటున్నారు బాలీవుడ్ జనాలు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుంది

No comments:
Post a Comment