క‌మ‌ల్‌హాస‌న్‌కు ప‌ద్మ‌విభూష‌న్‌..??


విశిష్ట న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్‌కు ప్ర‌భుత్వం ప‌ద్మ‌విభూష‌ణ్ తో స‌న్మానించ‌నుందా??   ఆ అవ‌కాశాలు ఉన్నాయ్ అంటున్నాయి త‌మిళ సినీ వ‌ర్గాలు. ఇటీవ‌ల కేంద్రానికి పంపిన సిఫార్సుల జాబితాలో ప‌ద్మ‌విభూష‌న్ గా క‌మల్‌హాస‌న్‌ని ఎంపిక చేయాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం కోరింది. ఈసారి ఎలాగైనా క‌మ‌ల్ ప‌ద్మ పుర‌స్కారం అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. విశ్వ‌రూపం విష‌యంలో క‌మ‌ల్‌కీ, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికీ ఓ మినీ యుద్ధం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో క‌మ‌ల్ ని ఈ పుర‌స్కారం కోసం ప్ర‌భుత్వం సిఫార్సు చేయ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. మ‌రోవైపు మమ్ముట్టికీ ఈ పుర‌స్కారం ల‌భించే అవ‌కాశాలున్నాయ‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచార‌మ్‌. ఇటీవ‌ల మ‌ర‌ణించిన ప్ర‌ముఖ గాయ‌కుడు మ‌న్నాడే పేరు కూడా ప‌ద్మ పుర‌స్కారాల సిఫార్సు జాబితాలో ఉంది. మ‌రి ఈ ముగ్గురిలో... ప‌ద్మ‌విభూష‌న్ ఎవ‌రిని వ‌రిస్తుందో చూడాలి.

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment