బాలీవుడ్ బ్రహ్మచారి కండల వీరుడి పై ఓ మద్దుగుమ్మ మనసుపడింది. ఈ విషయం అందరి ముందే సిగ్గుపడుతూ.. కండలవీరుడి సై .. నేను రెఢీ అంటుంది. అయితే ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా బిగ్ బాస్ రియాలిటీ షోతో ఫేమస్ అయిన ఎలి అవరామ్. బిగ్‌బాస్ హౌస్‌లో అత్యంత అందగత్తెగా ఈ అమ్మడికి పేరొచ్చింది. ఆ గుర్తింపుతోనే ‘మిక్కీ వైరస్’ అనే సినిమాలో కథానాయికగా అవకాశం అందుకుంది. ఇదే బాలీవుడ్‌లో తొలిసినిమా. ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాల్ని అందుకుంటోందీ ఎల్లి.
ఓ వైపు రియాలిటీ షోతో బిజీగా ఉంటూనే స్క్రిప్టులు వింటోంది. అయితే ఈ భామ కన్ను సల్మాన్ భాయ్‌పై పడిందని బాలీవుడ్‌లో ప్రచారమవుతోంది. బిగ్‌బాస్ హోస్ట్‌గా సల్మాన్ క్రేజు చూసిన ఎల్లీ ఈ కండలవీరుడిపై మనసు పారేసుకుందని వార్తా కథనాలు వస్తున్నాయి. కొందరైతే మరింత అడ్వాన్స్‌డ్‌గా ‘మిసెస్ సల్మాన్ ఖాన్’ అని అమ్మడిని పొగిడేసేసరికి .. ఉబ్బితబ్బిబ్బయిపోతోంది ఈ ముద్దుగుమ్మ. అబ్బో... నన్ను అలా పిలిచేస్తున్నారు. అది నిజమైతే ఎంత బావుణ్ణో అంటూ మనసులోని మాట బైట పెట్టేసింది అమ్మడు.
సల్లూ ఓకే అనాలి కానీ.. ఇల్లు, సంసారం చక్కదిద్దేయడానికి నేను సిద్ధమే అంటోంది. పెళ్లి అంటే చాలా ఆలోచించాలి అంటూ తెగ సిగ్గుల మొగ్గ అయిపోతోంది ఎల్లీ. ఇంతకీ.. ఈ కండల హీరోకి లైనేసిన బాలీవుడ్ ముద్దబంతుల్లో .. ఈ లిల్లీ పువ్వు నంబర్ ఎంతో? అయితే సల్మన్ ఖాన్ సై అని ఎప్పుడు ఏ ముద్దుగుమ్మతో అన్నట్లు బాలీవుడ్ చరిత్రలోనే లేదు. కండల వీరుడి మనసుపడితే.. ఇక ముందు జరగటమే.. ముద్దుగుమ్మల వంతు. అది తెలుసుకున్న భామలు.. కండలవీరుడితో.. రొమాన్స్ చేస్తారు.. అది తెలియకపోతే.. ఇలా కలలు కంటూ.. నిద్రలేని రాత్రులు గడుపుతూ, మీడియాలో వచ్చే పుకార్లు ఉబ్బితబ్బిపోవటమే . త్వరగా ఆలోచించుకోమని ఎల్లీకి బాలీవుడ్ భామలు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఎల్లీ సల్మాన్ వద్ద ఎలా అడ్వన్స్ అవుతుందో చూడాలని బాలీవుడ్ బాబులు ఆశగా ఎదురుచూస్తున్నారు

No comments:
Post a Comment