రేయ్ పాట‌లు రెడీ..


మెగా ఇంటి నుంచి మ‌రో న‌ట వార‌సుడొచ్చేస్తున్నాడు. త‌నే సాయిధ‌ర‌మ్ తేజ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం రేయ్‌. బొమ్మ‌రిల్లు సినిమా ప‌తాకంపై వైవిఎస్‌చౌద‌రి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. స‌యామీ ఖేర్ క‌థానాయిక‌. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. చ‌క్రి స్వ‌ర‌ప‌రిచిన ఈ చిత్రంలోని గీతాల‌ను డిసెంబ‌రు మొద‌టి వారంలో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ''మా బ్యాన‌ర్‌లో వ‌చ్చిన పాట‌ల‌న్నీ సూప‌ర్ హిట్టే. రేయ్ పాట‌లు కూడా అలాగే ఉంటాయి. మెగా అభిమానుల్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ఆడియో ఫంక్ష‌న్ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించుకొన్నాం. ఈ కార్య‌క్ర‌మానికి మెగా హీరోలంతా వ‌స్తారు'' అని వైవిఎస్ చౌద‌రి చెబుతున్నారు.

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment