సెన్సార్ పై నాని చ‌తుర్లు


A స‌ర్టిఫికెట్ తెచ్చుకోవ‌డం సినిమా వాళ్ల‌కు మ‌రీ ఫ్యాష‌నైపోయింది. మాకు ఏ వ‌చ్చింద‌హో.. అని గొప్పగా చెప్పుకొంటున్నారు. ఏ స‌ర్టిఫికెట్ తెచ్చుకోవ‌డానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించే బాప‌తూ ఉన్నారు. అదో ప‌బ్లిసిటీ స్టంట్ అయ్యింది. ఇప్పుడు నాని కూడా ఈ బాప‌తు జ‌నాల్లో చేరిపోయాడు. నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం పైసా. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు  A స‌ర్టిఫికెట్ మంజూరు చేసింది. ఇది రాగానే నాని ఎగిరి గంతేశాడు. నాకు చిన్న‌ప్పుడు ఎప్పుడూ ఏ గ్రేడ్ రాలేదు. తొలిసారి వ‌చ్చింది. ఇది చూసి మా అమ్మానాన్న సంతోషిస్తారు.. అంటూ  ట్విట్ట‌ర్లో చ‌తుర్లు వేస్తున్నాడు. సెన్సార్‌పై క‌డుపు మంట‌తోనే నాని ఇలా వ్యాఖ్యానించాడ‌ని కొంద‌రు, ఈ సినిమాకి ప‌బ్లిసిటీ తెచ్చుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని మ‌రి కొంద‌రు చెప్పుకొంటున్నారు. మొత్తానికి నాని.. త‌న సినిమాకి ఈ విధంగా ప్ర‌మోష‌న్ మొద‌లెట్టేశాడ‌న్న‌మాట‌.

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment