న‌రేష్ తో కార్తీక‌?


రాధ కూతురు కార్తీక ప‌నైపోయింది.. అనుకొంటున్నారంతా. జోష్ త‌ర‌వాత ద‌మ్ములో క‌నిపించింది. ఆ రెండూ ఫ్లాపులే. దానికి తోడు బొద్దుగా త‌యారైపోయింది. దాంతో కార్తీక కెరీర్ క్లోజ్ అనుకొన్నారు. కానీ ఇప్పుడు మ‌ళ్లీ ఓ తెలుగు సినిమాలో సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతోంది. న‌రేష్‌-చిన్నికృష్ణ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. బుధ‌వారం ఈసినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ చిత్రంలో ఇద్ద‌రు క‌థానాయిక‌లున్నారు. ఓ నాయిక‌గా కార్తీక ని ఎంచుకొన్న‌ట్టు స‌మాచార‌మ్‌. ఈమ‌ధ్య కార్తీక బాగా బ‌రువు త‌గ్గి స్లిమ్ గా త‌యారైంద‌ట‌. న‌రేష్ ప‌క్క‌న బాగుంటుంద‌ని.. ఆమె ను ఎంచుకొన్న‌ట్టు స‌మాచార‌మ్‌. త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టిస్తారు. అర‌వ అమ్మిరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖ‌ర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో అయినా కార్తీక తెలుగులో త‌న తొలి విజ‌యాన్ని అందుకొంటుందేమో చూడాలి. 

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment