ఇద్ద‌రు భామ‌ల‌తో న‌రేష్‌..


వీడు తేడా చిత్రంతో ఆక‌ట్టుకొన్నాడు ద‌ర్శ‌కుడు చిన్నికృష్ణ‌. ఆ సినిమా ఓ మోస్త‌రు విజ‌యాన్ని అందుకొంది.  ఇప్పుడు అల్ల‌రి న‌రేష్ తో జ‌త క‌ట్టాడు. ఈ కాంబినేష‌న్‌లో ఓ సినిమా  బుధ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. తొలి స‌న్నివేశానికి ఆర్య‌న్ రాజేష్ క్లాప్ ఇచ్చారు.  రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్‌గా సాగే ఈ క‌థ‌లో యాక్ష‌న్‌కీ చోటుంద‌ట‌. డిసెంబ‌రు చివ‌రి వారం నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఇందులో ఇద్ద‌రు క‌థానాయిక‌లుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క క‌థానాయిక‌నీ ఎంపిక చేయ‌లేదు. వారిద్ద‌రి  కోసం వేట సాగుతోంది. ఈ  చిత్రానికి శేఖ‌ర్ చంద్ర స్వ‌రాలు అందిస్తారు.

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment