సినీనటి హేమ కేవలం అభినయంలోనే కాదు
అందంలోనూ ఊర్వశే. కాస్త ఏజ్‌బారైనా కానీ చూడగానే ఆకట్టుకుంటుంది. ఇలానే ఓ
యువకుడ్ని కట్టిపడేసింది. ఇంకేముంది ఎలాగోలా ఆంటీ ఫోన్ నెంబరు కనిపెట్టి
మరీ తనకు మెస్సేజ్ లు పెట్టడం మొదలెట్టాడు. ఎంతకీ తనను కరుణించకపోయేసరికి
ఆసభ్య మెసేజ్ లు కూడా పెట్టడంతో హేమకు తలనొప్పి ఎక్కువయ్యింది.
ఇలా రోజుకోసారి నుంచి పూటకోసారి వరకు తన
పైత్యాన్ని ప్రదర్శించడం మొదలెట్టడంతో హేమా ఆంటీకి తిక్కరేగి మాదాపూర్
పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఇంకేముంది పోలీసులు ఒత్తిడి లేని కేసు అయితే
తప్పుదోవ పట్టిస్తారు కానీ ఇలాంటి కేసులను క్షణాలలో తేల్చేస్తారు.
మొత్తానికి ఆ కొంటె కుర్రాడ్ని లోపలేశారు.
ముందుగా రంగంలోకి దిగిన పోలీసులు.. ఫోన్
నెంబర్ ఆధారంగా వాడ్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఎంక్వైరీ
మొదలుపెట్టిన పోలీసులు వాడెవడు.. అసలు ఎందుకిలా చేసేడనే విషయాలు మాత్రం
ఇంకా బయటికి రానివ్వడం లేదు. పాపం స్వీట్ స్వీట్ గా తనదైన అమాయకపు కామెడీతో
ప్రేక్షకులని నవ్వించే హేమకు అంతకోపం తెప్పించే అంశం ఆ మెసేజ్‌లలో ఏముందో
మరి!

No comments:
Post a Comment