2014 ఎన్నికలు జరగనున్న నేపద్యంలో జూనియర్
ఎన్టీఆర్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రోజుకో కథనం, రోజుకో వార్త వెబ్
మీడియాలో షికారు చేస్తుంది. ఆయన ఏ పార్టీలోకి వెళ్తాడనే దానిపై మళ్లీ
ఊహాగానాలు వెలువడుతున్నాయి. జగన్ వైపు మొగ్గు చూపుతున్నాడంటూ ఇటీవల జోరుగా
వార్తలు వస్తున్న... దీనిపై జూనియర్ నుంచిగానీ జగన్ పార్టీ నుంచి ఎలాంటి
స్పందన లేకపోవడంతో జూనియర్ అబిమానులు సందిగ్దంలో పడ్డారు. ఈ విషయమై టీడీపీ
రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి తొలిసారి పెదవి విప్పారు. జూనియర్ ఎన్టీఆర్
పార్టీని వీడుతారా లేక తెలుగుదేశం లోనే కొనసాగుతారా అనేది చెప్పడానికి ఇది
సరైన సమయంకాదన్నారు.
ఎన్టీఆర్‌కు సినిమాల్లో మంచి భవిష్యత్తు
ఉందని అంటూనే... ఆయన తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటారని తాము
భావించడంలేదన్నారు. గతంలో కొడాలి నాని పార్టీని వీడినప్పుడు జూనియర్ ప్రెస్
మీట్ పెట్టి... కట్టెకాలే వరకూ తాత స్థాపించిన పార్టీలోనే వుంటానని
జూనియర్ చెప్పిన మాటలను రాజకీయ పార్టీలు గుర్తు చేసుకుంటున్నాయి. అయితే
ఈసారి జూనియర్‌కు పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాసరావు జగన్ పార్టీ నుంచి
టిక్కెట్ ఆశిస్తున్నాడని రోజుకో కథనం వస్తుంది. జూనియర్ తమ పార్టీ కోసం
ప్రచారం చేస్తే.. నార్నే శ్రీనివాసరావుకి గుంటూరు ఎంపీ లేదా ఎమ్మెల్యే
టిక్కెట్ ఇవ్వడానికి అభ్యంతరంలేదని జగన్ అన్నట్లు తెలుస్తోంది. ఒక ఎంపి
సీటు ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ అంత దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తాడని
అనుకోవటం లేదని నందమూరి అబిమానులు అంటున్నారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయం వెనుక
లక్ష్మిప్రణీత పాత్ర ఉందా అనుమానం కలుగుతుంది. ఒకవేళ ఎన్టీఆర్ భార్య
పట్టుబడితే జూనియర్ నిర్ణయం ఎలా ఉంటుందని రాజకీయవర్గాలలో చర్చ మొదలైంది.
మామ సెంటిమెంట్‌ను గౌరవించి జగన్ పార్టీ తరపున ప్రచారం చేస్తే.. తాత
పార్టీకి ద్రోహం చేసినట్లేనని తమ్ముళ్లు గుర్రుగా వున్నారు. ఏదేమైనా
జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు అడకత్తెరలో పోకచెక్కలా ఇబ్బందుల్లో పడిన మాట
మాత్రం నిజం. తెలంగాణా ఏర్పాటు అంశం వేడి మీద వుందన్న కారణంతో
ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగావున్నా.. రాబోయే కాలంలో తన నిర్ణయం చెప్పక
తప్పదు.
No comments:
Post a Comment