స్టార్ హోటళ్లు..రాజకీయ నేతల సరదాల సెంటర్లు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఓ లీడర్ వారం..వారం..పండగ చేసుకుంటుంటారు. నచ్చిన సినీ భామతో కాసేపు కాలక్షేపం. అయ్యగారికి అంతులేని ధనం పోగయింది. ఇక ఏం చేస్తారు..ధీమాగా తిరిగే సదరు నేత..చేతినిండా సొమ్ముతో అందాన్ని కొనేయడం షరామామూలైంది. సీమాంధ్రకు చెందిన ఆ లీడర్ చిన్నస్థాయి నుంచే చాలాపెద్ద స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం అదికార పార్టీలో మంచి హోదాలో ఉన్న ఈ నేతకి రాజకీయ ఎదుగుదలతోటే...కావాల్సినంత డబ్బుపోగయింది. ఈ నేత గతంలో వైఎస్ కు నీడ లాగా పని చేసారు. ఇయన గారి చేసిన స్కాములకి పది ఏళ్ళ జైలు శిక్ష పడేది... వైఎస్ పుణ్యానా బయట పడ్డాడు. చేసేవన్నీ తప్పుడు పనులు....ప్రజా సేవ భలేగా చేస్తున్నానంటూ చాలా ఫోజులిచ్చేస్తారు.
ఇంకేముంది ఆయనకు కావాల్సినవన్నీ క్షణాల్లో వచ్చి వాలతాయి. అహం కూడా అయ్యగారికి బాగానే ఉంది. అది ఆయన ఫేస్ లో ఇట్టే కనిపిస్తుంది. ఇయనగారి అంతులేని ఆనందానికి హైదరాబాద్లో స్టార్ హోటల్ వేదికైంది. అడ్డగోలుగా సంపాదించిన సొమ్ము కాబట్టే అంత ఈజీగా సొమ్ము వెదజల్లుతూ..వారం..వారం..సినీ అందాలతోపాటు మరెన్నో దక్కించుకోవడం అలవాటైంది. ఎంతయినా..డబ్బుంది..తగిన పలుకుబడి ఉంది..ఇక సరదాలకు ఏం తక్కువ..! వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం ఎలాగు లేదు.. చేతినిండా సంపాదించినా సొమ్ము ఎలాగు ఉంది... ఇప్పటి నుండే అనుభవించటం స్టార్ట్ చేసారు.. ఇదీ నేటి నేతల బాగోతం..
ఇక ఢిల్లీ స్థాయి మరో లీడర్ కూడా ఇలాంటి టేస్ట్ ల్లో స్పెషలిస్ట్..ఆయన టేస్ట్ వేరు. ఏకంగా సినీ భామతో దేశరాజధానిలోని ఓ హోటల్ లో చాలా కాలం కాపురం పెట్టేశారు. ఎవరో ఒక టూరిస్ట్ ఈయనెవరు..? ఇక్కడెందుకున్నారు..? అని అమాయకంగా వెంట ఉన్న నార్త్ ఇండియన్ ను అడిగారట. ఆయన ఫలానా లీడర్. ఆయన ఫ్యామిలీతో ఇక్కడే ఉంటున్నారు..? అని బదులివ్వగానే ఆశ్చర్యమేసింది. ఇంతకూ ఆ లీడర్ గారి సతీమణి ఎవరా..అని ఆరా తీస్తే..ఓ నడివయస్సు సినీ భామ అని తెలిసి విస్తుపోవాల్సి వచ్చింది. తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈ భామ తర్వాత బోజపురి వైపు వెళ్ళింది. అక్కడ నలుగు డబ్బులు బాగానే వెనకేసింది. ఆహా ఎంత అందమైన కాపురం..అని ఓ రికార్డు అందుకోవాల్సిన సీన్ కనిపించింది. ఇదీ నేటి తరం నేతల ప్రజాసేవ.
సదరు ఢిల్లీ స్థాయి లీడర్ కు కాపురం ఏర్పాట్లు చేసింది రాష్ర్టానికి చెందిన వారే. ఎందుకంటే అవసరాలు అలాంటివి..! పనులు కావాలంటే సదరు నేతల్ని సంతృప్తి పరచాలి కదా..? అందుకే ఇలాంటి స్పెషల్ ప్యాకేజి ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. వీళ్ళు దేశాన్ని ఉద్దరించడానికి కాదండి...వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చేది దేశాన్ని దోచి నాలుగు డబ్బులు వెనకేసుకొని దేశాన్ని నాశనం చెయ్యటానికి వస్తారు. దిగజారిన నేటి రాజకీయంలో అమ్మాయిల్ని ఎరవేయడం..అనుకున్నది సాధించడం ఒక అస్ర్తంగా మారింది. దటీజ్ పాలిట్రిక్స్..!!
No comments:
Post a Comment