కోలీవుడ్ 'కాసనోవా'గా పేరుతెచ్చుకున్న శింబు కన్ను ఇప్పుడు సమంతాపై పడిందా? ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ ఇదే! ఇప్పటికే హన్సిక ప్రేమకు గుడ్ బై చెప్పి, మళ్ళీ పాత ప్రియురాలు నయనతారకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్న శింబు, తాజాగా ఆమెను తన సినిమాలో కథానాయికగా బుక్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే, చెన్నయ్ భామ సమంతాతో కూడా ఓ సినిమా చేయాలని మన హీరో తెగ ముచ్చటపడిపోతున్నాడట.
అందుకే, ప్రస్తుతం తాను గౌతమ్ మీనన్ తో చేస్తున్న సినిమాలో సమంతాని తీసుకోమని శింబు చెప్పాడట. గౌతమ్ మీనన్ అంటే సమంతాకు చాలా గౌరవమన్న విషయం మనకు తెలిసిందే. బిజీగా ఉన్నప్పటికీ ఆయన మాటను కాదన్నదన్న ఉద్దేశంతోనే శింబు ఈ ప్రతిపాదన చేశాడని అంటున్నారు. మరి, దీనికి సమంతా ఓకే చెబుతుందా? ఆమె చెలికాడు సిద్ధార్థ్ అందుకు సమంతాని అనుమతిస్తాడా?
No comments:
Post a Comment