ప్రియమణికి ఇష్టం వుండదట!


తెరమీద కనిపించే హీరోయిన్లు రోడ్డు మీదకు వస్తే ఎవరైనా సరే ఇట్టే గుర్తుపట్టేస్తారు. చుట్టూ జనం మూగిపోతారు. ఆటోగ్రాఫులూ, ఫోటోగ్రాఫులూ అంటూ వెంటపడతారు. అయితే, అందాల ప్రియమణి బయటకు వెళితే మాత్రం ఆమెను ఎవరూ గుర్తుపట్టరట. దీని గురించి ఈ అందాలతార చెబుతూ, "సినిమాల్లో నటిస్తున్నప్పుడు తప్పనిసరి కాబట్టి మేకప్ వేసుకుంటాను. అయితే, బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం మేకప్ వేసుకోను. మామూలు సమయంలో మేకప్ వేసుకోవడం అంటే నాకు ఇష్టముండదు. అందుకే, నన్నెవరూ బయట గుర్తుపట్టలేరు. ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు గుర్తుపడుతున్నారనగానే అక్కడి నుంచి ఉడాయిస్తాను" అంటోంది ప్రియమణి. 

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment