నటుడిగా 25 యేళ్ల సుదీర్ఘ ప్రస్థానం వెంకటేష్ ది. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా..అందరినీ ఆకట్టుకొన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆయనకున్న అదనపు బలం. ఇప్పుడు క్రమంగా మల్టీస్టారర్ చిత్రాలవైపు టర్న్ అయి.. కొత్త కథలకు ప్రాణం పోస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమాలకు ఆయన నిర్మాతగానూ వ్యవహరించారు. అయితే తెరపై ఆయన పేరు కనిపించదు. ''నా సినిమాకి తెర వెనుక నిర్మాతను నేనే. బడ్జెట్ విషయంలో చాలా మొండిగా ఉంటా. ఓ నిర్మాత ఇంట్లోంచి వచ్చా కాబట్టి, నిర్మాత శ్రేయస్సు నాకు ముఖ్యం'' అంటుంటారు వెంకీ. భవిష్యత్తులో ఆయన దర్శకత్వం వహిస్తారా? ఈ విషయాన్ని అడిగితే ''డైరెక్షన్ నా వల్ల కాదు. అది పెద్ద బాధ్యత. కావాలంటే దర్శకుడికి నావైపు నుంచి సలహాలిస్తా. అదీ.. సెట్‌కి వెళ్లక ముందే. సెట్లో అడుగు పెట్టిన తరవాతే.. డైరెక్టరే బాస్' అని చెప్పుకొచ్చాడు వెంకీ. రాజకీయాల్లో చేరే ఆసక్తీ లేదట. రాజకీయాల్లో నిజాయతీ పనిచేయదని, దాన్ని చంపుకొనేవాళ్లకే అక్కడ మనుగడ అని చెబుతున్నాడు.
డైరెక్షన్ నావల్ల కాదు: వెంకటేష్

ADs
#CellPhone #Radiation on #Human #Body - #southreelnews
— South Reel News (@southreelnews1) 20 March 2017
https://t.co/FmjZ6iLbKQ
No comments:
Post a Comment