మ‌గాడొస్తున్నాడ్రా బుజ్జీ..!


ప్రేమ‌క‌థా చిత్రమ్‌తో తొలి విజ‌యాన్ని అందుకొన్నాడు సుధీర్ బాబు. అయితే ఆ క్రెడిట్ మొత్తం మారుతి అండ్ కో కొట్టేశారు. అందుకే ఈసారి మాస్ మొత్తాన్ని మెస్మ‌రైజ్ చేయాల‌ని సుధీర్‌బాబు భావిస్తున్నాడు. దానికి త‌గిన క‌థ‌, టైటిల్, క్యారెక్ట‌ర్‌... ఇవి మూడూ అందుకొన్నాడు. ఆ సినిమానే ఆడు మ‌గాడ్రా బుజ్జీ. అస్మితా సూద్ క‌థానాయిక‌.  కృష్ణారెడ్డి గంగ‌దాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈయ‌న రాజ‌మౌళి శిష్యుడు.నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సోమవారం ఈ సినిమా సెన్సార్ ముందుకు వెళ్తుంది. డిసెంబ‌రు 5న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా బిజినెస్ పూర్త‌యింది. అనుకొన్న‌దానికంటే మంచి రేటు ల‌భించింది. ట్రైల‌ర్ చూసి.. ఈ సినిమాపై అంచ‌నాలు పెంచుకొంటున్నారు జ‌నాలు. మ‌రి వాళ్ల‌కు ఈ మగాడు ఎలాంటి అనుభ‌వాన్ని ఇస్తాడో ?  

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment