పవన్ రాజకీయ మెమోరిలో మిస్సింగ్ లీడర్స్..


పవన్ కల్యాణ్..యంగ్ డైనమిక్ స్టార్. ఏదైనా మనస్సులో ఉంటే వెనకాముందు లేకుండా డైలాగ్ వదిలేసే డేరింగ్ స్టార్. అలాంటి పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది ...మూవీ పైరసీ తర్వాత కాస్త కరడుగట్టిన ప్రతీకార వాదిగా మారారా..? అత్తారింటికి పైరసీకి కారణమైన పెద్దల్ని మనసులో రికార్డు చేసేసుకున్నారా..? సరైన సమయంలో షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారా..? అంటే..అవును నిజమే అనే సమాధానం పవన్ గురించి తెలిసిన అభిమానుల నుంచి వస్తోంది. పవన్ అంటే కల్మషం లేని వ్యక్తితత్వం. కష్టాల్లో ఉన్న తనవారిని ఆదుకునే తత్వం. బంధువర్గమైనా..అభిమాన వర్గమైనా..వీలయినంత వరకు సాయం చేయాలనే చూస్తారు. ఎలాంటి లాభనష్టాలు బేరీజువేసుకోరు. అదీ పవన్ స్టయిల్.

నాగబాబు ఓ సినిమాలో చాలా నష్టపోయినప్పుడు ఆయన్ని ఆదుకోవడానికి ఎవరు ఆదుకుంటారనే డైలమా వచ్చింది. అలాంటి క్లిష్టసమయంలో పవన్ కల్యాణ్ అన్నయ్యా..నేనున్నానంటూ సహాయం చేశారని తెలుస్తోంది. ఇదే జాలి గుణం..మానవత్వం..పవన్ కల్యాణ్ వ్యక్తితత్వానికి ఆభరణాలు. అవే ఆయన్ని విజయపథంలో నడిపిస్తున్నాయి. ఏ పెద్దమనిషయితే..అత్తారింటికి దారేది..సినిమా పైరసీకి పాల్పడ్డారో..అలాంటి కమర్షియల్ వ్యక్తులకు గుణపాఠంలా ఆ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అది పవన్ కల్యాణ్ నిజాయితీకి ప్రేక్షకులు..అభిమానులు ఇచ్చిన విజయం.
విలక్షణమైన పవన్ కల్యాణ్..రీసెంట్ గా కొదరు నేతల్ని టీవీలో చూస్తూ..చేసిన కొన్ని కామెంట్స్ రాజకీయ చర్చకు ఆస్కారమిచ్చాయి.

 టీవీలో చాలా గొప్పగా రాజకీయ సందేశం ఇస్తున్న ఓ అధికారంలో ఉన్న నేతను చూసి..ఈయనెవరు..? అంటూ ప్రశ్నించి తన సందేహాన్ని తీర్చుకున్నారు. అలాగే సెంటర్ లో పవర్ లో ఉండి.. పవర్ ఫుల్ అని చెప్పుకునే ఓ నాయకుడ్ని కూడా చూసి ఈయనెవరేటి..? అని కొంటెగా వేసిన ప్రశ్న కూడా పక్కనే ఉన్న వారిని ఆశ్చర్యపరిచింది. సార్ ..వీరు..అంటూ పక్కనే ఉన్న వారు సమాధానం చెబుతుండగా..ఓ వీరా..ఎప్పుడో రాజకీయ సిద్ధాంతాల నుంచి పారిపోయారు కదా..? అంటూ డైలాగ్ వదలడం పవనిజాన్ని తెలియజేస్తోంది. అంటే ..పవన్ కల్యాణ్ కు కొందరు నేతల రాజకీయ మెమోరీ లాస్ అయిందా..? తన రాజకీయ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్న వారిని మైండ్ లోంచి చెరిపేశారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇక పవన్ కల్యాణ్ ..అత్తారింటికి దారేది..మూవీ పైరసీ దారులపై ప్రతీకారం తీర్చుకునే సమయం ఎప్పుడు..? ఆయన టార్గెట్ లో ఉన్నదెవరు..? వారికి పవన్ స్టయిల్ లో ఇచ్చే షాక్ ఏమిటి..? ఈ ప్రశ్నలన్నీ చర్చనీయాంశమయ్యాయి. పవన్ కల్యాణ్ కు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేకున్నా..రానున్న రాజకీయ సీజన్ లో పవర్ ఫుల్ డైలాగ్స్ వదిలే సూచనలున్నాయి. పవన్ సిద్ధాంతం ఏమిటో...పైరసీ దారులకు చెప్పే బుద్దేమిటో..కూడా ఆ డైలాగ్స్ రూపంలోనే ఉంటాయని తెలుస్తోంది. అవేమిటో తెలియాలంటే.. ఆ టైమ్ దాకా వేచి చూడాల్సిందే..!

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment