బంగారు కోడిపెట్ట U/A


న‌వ‌దీప్‌, స్వాతి జంట‌గా న‌టించిన చిత్రం బంగారు కోడిపెట్ట‌. రాజ్ పిప్ప‌ళ్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. గురు ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఇటీవ‌ల ఈ చిత్రానికి సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ బోర్డు  U/A ధృవీక‌ర‌ణ ప‌త్రం జారీ చేసింది. కిడ్నాప్, బంగారు నాణాల చోరీ నేప‌థ్యంలో సాగే క్రైమ్ థ్రిల్ల‌ర్ ఈ చిత్రం. చిత్రీక‌ర‌ణ ఎప్పుడో పూర్త‌యింది. కానీ అనివార్య‌కార‌ణాల వ‌ల్ల విడుద‌ల చేయ‌లేక‌పోయారు. డిసెంబ‌రు నెల‌లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. స్వామి రారా లాంటి హిట్ సినిమా త‌ర‌వాత స్వాతి సినిమా విడుద‌ల కావ‌డం ఇదే తొలిసారి. స్వామి రారా కూడా క్రైమ్ థిల్ల‌రే!  అదే త‌ర‌హాలో సాగే ఈ సినిమా స్వాతికి ఎలాంటి పేరు తీసుకొస్తుందో చూడాలి. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తారు.

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment