దేశంలో సంచలనం రేపిన 13 సంవత్సరాల బాలిక ఆరుషి హత్య కేసుకు సంబంధించిన తుది తీర్పు ఇటీవలే వచ్చిన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించి సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కేసులో ముద్దాయిలు ఆరుషి తల్లిదండ్రు రాజేష్ తల్వార్ , నపూర్ తల్వార్ లే అని తేల్చి వారికి యావజ్జీవ శిక్ష ప్రకటించింది.
ఈ ఉదంతాన్ని తెరకెక్కించడానికి సినిమాకు చెందిన దర్శక నిర్మాతలు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఆరుషి హత్య, తదనంతర పరిస్థితుల నేపధ్యంగా సినిమా తీసేందుకు పోటీ పడుతున్నారు. పని మనిషితో లైంగిక సంబంధం పెట్టుకున్నదన్న కారణంగా ఆమెను, అతడిని హత్య చేశారనే అభియోగం, కోర్టు తీర్పు వరకు జరిగిన తీరును సినిమాగానూ, నవలగానూ ఎక్కించేందుకు లండన్ లో ఉంటున్న ఓ ప్రముఖ రచయిత, నిర్మాత ముందుకు వచ్చాడు. జైలులో ఉన్న ఆరుషి తల్లిదండ్రులు ఒప్పుకుంటే వారికి రూ. 5 కోట్లు చెల్లించేందుకు కూడా తాను సిద్ధమని ప్రకటించాడు.
వారి అంగీకారం కోసం ఘజియాబాద్ లోని జైలుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఐతే జైలు అధికారులు అనుమతించకపోవడంతో త్వరలో ఎలాగైనా వారిని కలిసి తన ఆలోచనను వారి ముందు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇతని ప్రయత్నం చూసి వర్మ కూడా వెళ్లి కలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో ?
No comments:
Post a Comment