టాలీవుడ్ లోకి రీసెంటుగా వచ్చి, తనకు తానే హీరోగా బిల్డప్ ఇచ్చుకుంటూ కావాల్సినంత పాపులారిటీ సంపాదించుకున్న మన బర్నింగ్ స్టార్ ‘సంపూర్నేష్ బాబు ’ ‘హృదయ కాలేయం ’ అంటూ జనాల మైండ్ తింటున్న ఈయన ఏకంగా బూతు దర్శకుడి చేతిలో పడ్డాడు.
ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా టీజర్ కి యూ ట్యూబ్ లో ‘బి ’ గ్రేడ్ హీరోకి రానన్ని హిట్స్ రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీనే విస్మమయం చెందింది. ఈసినిమా విడుదల కాకముందే సంపూర్నేష్ బాబు మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘కొత్త జంట ’ సినిమాలో ఓ పాత్ర పోషిస్తున్నాడట. ఈ సినిమాలో ఈయన క్యారెక్టర్ కీ రోల్ అని కూడా చెబుతున్నాడు దర్శకుడు.
‘హృదయ కాలేయం ’ లో కాస్తంత పెట్టబడి పెట్టిన మారుతి అది తిరిగి రావాలంటే ఈయనకు పారితోషికం ఇవ్వకుండా ఓ రోల్ ఇచ్చాడనే వార్త కూడా ఫిలింనగర్ లో సంచరిస్తుంది. ఏమైతేనేం ప్రస్తుతం ‘సంపు బాబు ’బిజీ బిజీ.

No comments:
Post a Comment