సంపూర్ణేష్ బాబు స్టోరీ ఇదే


సంపూర్ణేష్ బాబు అంటే ఎవరికి తెలియకపోవచ్చు.. ‘హృదయ కాలేయం’సినిమా హీరో అంటే అందరికి తెలుస్తుంది. ఇప్పడు అందరి ద్రుష్టి సంపూర్ణేష్ బాబు మీద పడింది. అసలు ఇతను ఎవరు? కథ ఏంటి? గతంలో ఎప్పుడు, ఎక్కడ చూడలేదు. ఒక్కసారిగా ఇంత క్రేజ్ సంపాదించుకున్నాడు? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయి. అయితే మన సంపూ.. బాబు టాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్నాడనే విషయం ఎవరికి తెలియదు. కానీ దర్శకుడు క్రిష్ణ వంశీకి మాత్రం బాగా తెలుసునని టాలీవుడ్ వాసులు అంటున్నారు. అంటే డైరెక్టర్ క్రిష్ణ వంశీ దగ్గర తన సినిమా జీవితాన్ని ప్రారంభించాడు.   అప్పటి నుండి క్రిష్ణ వంశీ దగ్గర ఉంటూ .. ఆయన తీసిన ‘మహాత్మ’ సినిమాలో చిన్న పాత్ర పోషించాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు మంచి అవకాశం వస్తుంది. అదేవిధంగా మన సంపూర్ణేష్ బాబుకు కూడా అవకాశం తలుపు తట్టింది. అద్రుష్టం రూపంలో దర్శకుడు స్టీవెన్ శంకర్ కు సంపూ.. బాబు దొరికాడు. ఒక ఆడియో ఫంక్షన్ వద్ద స్టీవెన్ శంకర్ కు సంపూర్ణేష్ బాబు ముఖం మత్యంలా మెరిసింది. ఆ మెరుపులో దర్శకుడు స్టీవెన్ శంకర్ సంపూ.. బాబును ఒక హీరో గా ఊహించుకోని.. తన మనసులో దాచుకున్న సినిమా స్టోరీని చెప్పటం జరిగింది.అద్రుష్టం కళ్ల ముందుకు వచ్చి నిలబడితే..ఎవడు కాలతన్నుకుంటాడు చెప్పండి. సినిమా స్టోరీ కూడా పూర్తిగా వినకుండానే, మీ ఇష్టం.. మీ సినిమాలో ఎలాంటి పాత్రకైన నన్ను ఉపయోగించుకోండని .. ఆయన కాళ్ళ మీద పడి చెప్పినట్లు టాలీవుడ్ లో సమాచారం.   ఇక అప్పటి నుండి బర్నింగ్ స్టార్ గా మారిపోయి, ఇంటర్నెట్ అండతో సంపూ.. రెచ్చిపోయాడు. ఇక మన వాడి లైప్ తంతే గారేల బుట్టలో పడ్డట్టూ సంపూర్ణేష్ బాబు సుడి తిరిగిపోయింది. హృదయ కాలేయం తో అందరి ముందు బర్నింగ్ స్టిల్స్ ఇస్తున్నాడు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకముందే మరో సినిమా ఛాన్స్ మన సంపూర్ణేష్ బాబు కు దక్కింది. దీంతో మన సంపూ లైప్ స్టోరీలో రంగుల హరివిల్లు విరిసిందని ఆయన అభిమానులు అంటున్నారు. -

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment