కనిపించే లోకం నుండి..కనిపించనిరంగుల లోకంలోకి అమ్మాయిలు అడుగులు పెడుతున్నారు. ఇలాంటీ
అమ్మాయిల కోసం ఎదురుచూసే మగమహరాజులు కుప్పతెప్పలుగా ఉన్నారు. పెరుగుతున్న ఫ్యాషన్ పై మోజుతో.. అమ్మాయిల అడుగులు సినిమా ప్రపంచం వైపు పడుతున్నాయి. ఇదే అవకాశంగా చేసుకొని కొంతమంది అమ్మాయిలకు సినిమా ఛాన్స్ లు ఇస్తాం, ఫలానా సినిమాలో నువ్వే హీరోయిన్ అంటూ మాయ మాటలు చెప్పి, సింగిల్ మజా బాటిల్స్ రెండు స్ట్రాలు వేసుకొని తాగేవరకు తీసుకుపోతున్నారు.
అతను చెప్పిన మాయ మాటలతో.. కళ్లకు మైకం కమ్ముకొని, కలల లోకంలో విహరిస్తాస్తున్నారు. అక్కడ సిన్ కట్ చేస్తే.. గర్బవతులుగా బయటపడుతన్నారు. ఇప్పుడు ఇలాంటి సన్నివేశం మనటాలీవుడ్ లోనే జరిగింది. సినిమాల్లో హీరోయిన్ చేస్తానంటూ సినిమా దర్శకుడు చాంద్ పాషా మోసం చేసి.. తనను గర్భవతిని చేశాడని శ్రీజ అనే సీరియల్ కళాకారిణి నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గత ఆరు నెలలుగా తనను మోసం చేశాడని తెలిపింది. చాంద్ పాషాకు గతంలోనే పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలున్నారు. మళ్లీ తనను కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పాడని ఆమె చెప్పింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతానికి చెందిన శ్రీజను లవ్ ఈజ్ గేమ్ అనే సినిమాలో హీరోయిన్ చేస్తానని అతడు మోసగించినట్లు తెలిపింది. ఇంతకుముందు అతడు లవ్ సిలబస్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. పోలీసులు ఈరోజు తెల్లవారుజామున చాంద్ పాషాను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment